: వడదెబ్బతో ఏపీలో 19 మంది... తెలంగాణలో 18 మంది మృతి


ఏపీలో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. ఈరోజు ఉదయానికల్లా రాష్ట్రంలో వడదెబ్బ తగిలి 20 మంది మృతి చెందారు. ప్రకాశం జిల్లాలో ఆరుగురు, నెల్లూరు జిల్లాలో నలుగురు చనిపోయారు. గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ముగ్గురు చొప్పున మరణించారు. ఇక కర్నూలు జిల్లాలో ఇద్దరు, అనంతపురం జిల్లాలో ఒకరు చనిపోయారు. రాష్ట్రంలో ఎండల తీవ్రతపై ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. వడదెబ్బ తగలకుండా తీసుకోవల్సిన జాగ్రత్తలపై ప్రచారం కల్పించాలని ఆదేశించారు. అన్ని జిల్లాల్లో వైద్య బృందాలను అందుబాటులో ఉంచాలని సూచించారు. తెలంగాణలో వడదెబ్బకు తట్టుకోలేక 18 మంది చనిపోయారు. ఖమ్మం జిల్లాలో ఆరుగురు, నల్గొండలో ఐదుగురు, ఆదిలాబాద్ లో ముగ్గురు, కరీంగనర్ లో ఇద్దరు చనిపోయారు. వరంగల్ జిల్లాలో ఇద్దరు మృత్యువాతపడ్డారు.

  • Loading...

More Telugu News