: నియామకాలు, తీసివేతల అధికారం గవర్నరుదే... ఆప్ కు చెప్పాల్సిన అవసరం లేదన్న హోం శాఖ


ఢిల్లీలో ఆప్ ప్రభుత్వం, లెఫ్టినెంట్ గవర్నర్ మధ్య నెలకొన్న వివాదం కీలక మలుపు తిరిగింది. అధికారులను పోస్టింగ్ చేయడం, బదిలీలు, తొలగింపు వంటి అధికారాలు గవర్నరుకు ఉన్నాయని, ఈ విషయంలో ముందస్తు సమాచారాన్ని ప్రభుత్వానికి చెప్పాల్సిన అవసరం లేదని కేంద్ర హోం శాఖ వెల్లడించింది. ఈ మేరకు లెఫ్టినెంట్ గవర్నర్ అధికారాలను తెలుపుతూ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఉద్యోగ సంబంధిత వ్యవహారాలు, శాంతి భద్రతలు, పోలీస్, భూములు తదితర విషయాలు ఆయన పరిధిలోనివేనని స్పష్టం చేసింది. ఢిల్లీలో గవర్నరు అధికారాలను అడ్డంపెట్టుకుని కేంద్రం తమపై పెత్తనం సాగిస్తోందని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News