: భారత్ లో ఆ రెండు నగరాలకే తీవ్రవాద ముప్పు ఎక్కువట!
ప్రపంచవ్యాప్తంగా తీవ్రవాద ముప్పు పొంచి ఉన్న వివిధ నగరాలతో లండన్ విశ్లేషకులు ఓ జాబితా రూపొందించారు. ఇందులో పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ముఖ్యంగా భారత్ లోని ఈశాన్య రాష్ట్రాల రాజధానుల్లో ఒకటైన ఇంపాల్ (మణిపూర్), జమ్మూ కాశ్మీర్ రాజధాని శ్రీనగర్ లపై తీవ్రవాదులు దాడి చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలిపింది. ఈ నేపథ్యంలో జాబితాలో ఇంపాల్ కు 32, శ్రీనగర్ 49వ స్థానంలో నిలిచాయని చెప్పింది. ఇటు దక్షిణ భారతానికి వస్తే బెంగళూరు నగరం 204, పూణె, హైదరాబాద్ లు 206, 207 స్థానాల్లో ఉన్నాయట. చాలా స్థానాల తేడాతో దేశ రాజధాని న్యూఢిల్లీ 447 స్థానంలో ఉందట. ఇటు నాగపూర్, కోల్ కత్తా నగరాలు 2010, 2012 స్థానాల్లో ఉన్నాయని, చెన్నై నగరానికి తీవ్రవాదుల ముప్పు మధ్యస్తంగా ఉందని లండన్ జాబితా చెప్పుకొచ్చింది. జాబితాలో భారత్ నుంచి మొత్తం 113 నగరాలు ఉన్నాయి.