: భార్య ఫోటోలు నెట్లో పెట్టి చెక్కేసిన టెక్కీ!
కట్టుకున్న భార్యల చిత్రాలను, అందునా ప్రైవేటుగా తీసిన వాటిని సామాజిక మాధ్యమాల్లో పెట్టి పైశాచికానందం పొందుతున్న భర్తల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. తాజాగా అనంతపురం జిల్లా ఉరవకొండకు చెందిన చిరంజీవి అనే ఓ టెక్కీ, తన భార్య చిత్రాలను రహస్యంగా తీసి ఇంటర్నెట్ లో అప్ లోడ్ చేశాడు. చెన్నైలోని ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు. ఫోటోలు అప్ లోడ్ చేసిన తరువాత చెప్పాపెట్టకుండా వెళ్లిపోయాడు. విషయాన్ని గమనించిన అతని భార్య తన తల్లిదండ్రుల సహాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. చిరంజీవి చెన్నైకి వెళ్లి ఉంటాడని భావిస్తున్న పోలీసులు, అతని కోసం గాలిస్తున్నారు.