: సెల్ఫీ కాదు...ఎల్ఫీ...సోషల్ మీడియాలో హల్ చల్


ఎల్ఫీ ఎప్పుడైనా దిగారా? ఎల్ఫీ అంటే ఏంటి అనుకుంటున్నారా? మనం తీసుకుంటే సెల్ఫీ, అదే ఏనుగు తీస్తే ఎల్ఫీ. ఏనుగు ఫోటో తీయడమేంటి? అనుకోకండి. ఓ ఏనుగు తీసిన ఎల్ఫీ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. బ్రిటిష్ కొలంబియా యూనివర్సిటీ విద్యార్థి క్రిస్టియన్ లీ బ్లాక్ కి ట్రావెలింగ్ అంటే బహు సరదా. దీంతో క్రిస్టియన్ ధాయ్ లాండ్ వెళ్లాడు. ఏనుగులకు ప్రసిద్ధి చెందిన ధాయ్ లాండ్ లో ఓ ఏనుగుకు ఆహారం తినిపిస్తూ సెల్పీ తీయాలని భావించాడు. ఆహారం తినిపిస్తుండగా, అతని చేతిలోని కెమెరాను ఏనుగు లాక్కుంది. సరిగ్గా అప్పుడే ఆటో మోడ్ లో ఉన్న కెమేరా క్లిక్ మనిపించింది. దీంతో సెల్ఫీ...ఎల్ఫీ అంటూ ఆయన ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేశాడు. దీనికి సోషల్ మీడియాలో లైకులు వెల్లువెత్తాయి.

  • Loading...

More Telugu News