: అభివృద్ధిని అడ్డుకునే ఏ శక్తి కూడా చరిత్రలో నిలబడలేదు: మంత్రి జగదీశ్ రెడ్డి


తెలంగాణ రాష్ట్ర మంత్రి జగదీశ్ రెడ్డి విపక్షాలపై ధ్వజమెత్తారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు ప్రతిపక్షాలు అడ్డుతగులుతున్నాయని ఆరోపించారు. అభివృద్ధిని అడ్డుకునే ఏ శక్తి కూడా చరిత్రలో నిలబడలేదని వ్యాఖ్యానించారు. ఉస్మానియా వర్శిటీ భూముల్లో పేదలకు ఇళ్లు నిర్మించి ఇవ్వాలని సర్కారు భావిస్తే, దాన్ని రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. గాంధీభవన్ లో కూర్చుని మాటలతో రెచ్చగొడుతున్నారని పరోక్షంగా కాంగ్రెస్ పార్టీ నేతలను విమర్శించారు. ఇటువంటి చర్యలు వాళ్లనే నష్టపరుస్తాయని అన్నారు. టీఆర్ఎస్ సర్కారు ప్రజలకోసమే పనిచేస్తుందని పునరుద్ఘాటించారు. ప్రగతి నిరోధకులకు ఎక్కడా చోటు ఉండదని స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News