: టి.టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా వేం నరేందర్ రెడ్డి
తెలంగాణ టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా వేం నరేంద్రరెడ్డి పేరు ఖరారైంది. ముఖ్యమంత్రి చంద్రబాబే ఈ నిర్ణయం తీసుకుని స్వయంగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో సాయంత్రానికల్లా నరేంద్ర నామినేషన్ వేయనున్నారు. మరోవైపు చంద్రబాబు బీజేపీ నేతలతో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో సమావేశమయ్యారు. కేంద్రమంత్రి, బీజేపీ సీనియర్ నేత బండారు దత్తాత్రేయ, ఎమ్మెల్యేలు లక్ష్మణ్, చింతల రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా వేం నరేంద్రరెడ్డి పేరును నిర్ణయించిన క్రమంలో ఆయన్ను గెలిపించుకునే విషయంపై చర్చిస్తున్నట్టు సమాచారం.