: రాజీవ్ గాంధీకి నివాళులర్పించిన మోదీ


మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 24వ వర్ధంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ నివాళులర్పించారు. ఈ మేరకు ప్రధాని ట్విట్టర్ లో రాజీవ్ ను గుర్తు చేసుకున్నారు. "మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా నివాళులర్పిస్తున్నాను" అంటూ మోదీ ట్వీట్ చేశారు. అటు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీలు, రాజీవ్ కుమార్తె ప్రియాంక గాంధీ, అల్లుడు రాబర్ట్ వాద్రాలు ఢిల్లీలోని రాజీవ్ స్మారక సమాధి వీర్ భూమి వద్ద నివాళులర్పించారు.

  • Loading...

More Telugu News