: ఎండ వేడి తట్టుకోలేరు... బయటకు వెళ్లొద్దు: అధికారుల హెచ్చరిక
తెలుగు రాష్ట్రాల్లో ఎండ వేడిమి అత్యధికంగా ఉన్నందున ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ బయట తిరగవద్దని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 4 డిగ్రీల వరకూ అధికంగా నమోదవుతున్నాయని, ఈ వేడి వృద్ధులు, చిన్నారులు, పోషకాహార లోపం ఉన్నవారిపై పెను ప్రభావం చూపుతుందని, ఒక్కోసారి ప్రాణాలు కూడా పోవచ్చని అధికారులు తెలిపారు. సాధ్యమైనంత వరకూ బయటకు వెళ్లవద్దని, అత్యవసరమైతే తగు జాగ్రత్తలు తీసుకుని వెళ్లాలని సూచిస్తున్నారు. కాగా, నేడు నిజామాబాద్ లో అత్యధికంగా 46 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, హైదరాబాద్, విజయవాడ తదితర ప్రాంతాల్లో ఎండ వేడి 43 డిగ్రీలు దాటింది.