: జూపూడిని వెన్నాడిన దురదృష్టం... ప్రతిభా భారతికి దక్కిన ఎమ్మెల్సీ స్థానం


ఒకప్పటి వైకాపా నేత, ప్రస్తుత తెలుగుదేశం అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకరరావును అదృష్టం పలకరించినట్టే పలకరించి, ఆ వెంటనే వెక్కిరించింది. ఏపీ శాసనసభలో తెలుగుదేశం పార్టీ తరపున ఎమ్మెల్సీ స్థానం దక్కినట్టే దక్కి చేజారిపోయింది. ఆయనకు ఆంధ్రప్రదేశ్ లో ఓటు హక్కు లేకపోవడంతో తదుపరి సమస్యలు వస్తాయని భావించిన తెలుగుదేశం ఆయన్ను తప్పించింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయాలంటే, ఆ రాష్టంలో స్థానికత తప్పనిసరి. కాగా, జూపూడి స్థానంలో ప్రతిభా భారతిని రంగంలోకి దించారు. దీంతో మహిళలకు ఈ దఫా సీట్లివ్వలేదన్న విమర్శను తెలుగుదేశం తప్పించుకున్నట్లయింది.

  • Loading...

More Telugu News