: గేల్, డివిలియర్స్, కోహ్లీల దూకుడును ... ఫాల్కనర్, వాట్సన్, మోరిస్, తాంబే అడ్డుకోగలరా?


రెండో క్వాలిఫయర్ మ్యాచ్ తో ఇంటి ముఖం పట్టేదెవరో నేడే తేలిపోనుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో రాజస్థాన్ రాయల్స్ తలపడనుంది. బెంగళూరు జట్టుకు చెందిన గేల్, డివిలియర్స్, కోహ్లీ ప్రత్యర్ధులపై విరుచుకుపడుతూ క్వాలిఫై కాగా, తమ సమష్టితత్వమే తమను గెలిపిస్తుందని రాజస్థాన్ ఆటగాళ్లు నిరూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో నేటి మ్యాచ్ లో బెంగళూరు హాట్ ఫేవరేట్ గా బరిలోకి దిగుతోంది. ఐపీఎల్ సీజన్-8 చివరి అంకానికి చేరువవుతున్న కొద్దీ మ్యాచ్ లు రసవత్తరంగా జరుగుతున్నాయి. ముంబై, చెన్నై జట్ల మధ్య జరిగిన తొలి క్వాలిఫయర్ మ్యాచ్ అభిమానులకు క్రికెట్ మజా పంచితే, నేటి మ్యాచ్ ఆ మజాను మరింత రంజుగా అందించనుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. నేటి మ్యాచ్ ను బెంగళూరు బ్యాట్స్ మన్ వర్సెస్ రాజస్థాన్ బౌలర్ల సమరంగా వారు పేర్కొంటున్నారు. బంతి గతి తప్పితే బౌండరీ లైన్ దాటించగల సత్తా ఉన్న గేల్, డివిలియర్స్, కోహ్లీ, దినేష్ కార్తిక్, మనీష్ పాండే, సర్ఫరాజ్ ఖాన్, అక్షర్ పటేల్ వంటి వారిని ఊరించి పెవిలియన్ బాట పట్టించే బంతులను రాజస్థాన్ ఆటగాళ్లు మోరిస్, ఫాల్కనర్, వాట్సన్, ప్రవీణ్ తాంబే వేయగలరా? అనే సందేహం అందర్లోనూ నెలకొంది. రాజస్థాన్ జట్టుకు ఒంటి చేత్తో విజయాలు సాధించిపెట్టిన రహానే, వాట్సన్ కు బెంగళూరు ఎలా చెక్ పెడుతుందోనని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

  • Loading...

More Telugu News