: మతిమరుపు వల్లే తాళి కట్టబోయా... విషయం పెద్దది చేయవద్దు: సుబ్రహ్మణ్య స్వామి


వివాహానికి హాజరై పెళ్లి కూతురికి తాళి కట్టబోయిన బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి తన చర్యపై వివరణ ఇచ్చారు. మతిమరుపు వల్లే అలా జరిగిందని సోషల్ మీడియా ద్వారా తెలిపారు. తనకు ఎలాంటి చెడు ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని పెద్దది చేయవద్దని విజ్ఞప్తి చేశారు. తిరునల్వేలిలో ఓ బీజేపీ నేత కుమార్తె వివాహానికి వెళ్లిన సుబ్రహ్మణ్య స్వామి... ఆశీర్వదించమని అందించిన తాళిని తీసుకుని వెళ్లి పెళ్లి కూతురి మెడలో కట్టేందుకు ప్రయత్నించడం తెలిసిందే. తాళి కట్టబోతున్న ఆయనను పక్కనే ఉన్న చంద్రలేఖ అనే బీజేపీ మహిళా నేత నిలువరించారు. దీంతో, పెద్ద ప్రమాదం తప్పినట్టయింది.

  • Loading...

More Telugu News