: మా అబ్బాయికి తగిన 'వరుడు' కావలెను!
వివాహ ప్రకటనలో తప్పు దొర్లిందని అనుకుటున్నారా? కాదు, అది నిజంగా ప్రకటనే. సాధారణంగా అబ్బాయికి 'వధువు' కావాలని ప్రకటన ఇస్తారు. కానీ ముంబైకు చెందిన ఓ మహిళ తమ 'గే' అబ్బాయికి పెళ్లి చేసేందుకు 'వరుడు' కావాలని ప్రకటన ఇచ్చారు. అయితే ఈ ప్రకటనకు సోషల్ మీడియాలో విశేషమైన స్పందన వచ్చింది. చాలామంది ఫోన్ కాల్స్ కూడా చేశారట. ముంబై 'ఎల్జీబీటీ' (లెస్బియన్, గే, ఉభయ సంపర్కం, లింగమార్పిడి) సమాజంలో సుపరిచితుడైన హరీష్ అయ్యర్ వివాహానికి అతని తల్లి వివాహప్రకటన ఇచ్చారు. లక్సెంబర్గ్ ప్రధాని 'గే' వివాహం తరువాత ఈ తరహా వివాహాలకు బహిరంగ ప్రకటనలు ఎక్కువయ్యాయి.