: గిన్నిస్ రికార్డు సాధించిన ఒబామా


అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఓ గిన్నిస్ రికార్డును సృష్టించారు. ట్విట్టర్ లో ఖాతాను ప్రారంభించిన ఐదు గంటల వ్యవధిలో 10 లక్షల మంది ఫాలోవర్లను సంపాదించిన వ్యక్తిగా ఆయన రికార్డులకెక్కారు. '@potus' పేరిట ఆయన తన ఖాతాను ఓపెన్ చేసిన సంగతి తెలిసిందే. గతంలో హాలీవుడ్ నటుడు రాబర్ట్ డౌనీ జూనియర్ 23 గంటల 22 నిమిషాల్లో పదిలక్షల మంది ఫాలోవర్లను సంపాదించి గిన్నిస్ రికార్డును నెలకొల్పగా, ఒబామా దానిని అధిగమించారు. ఈ విషయాన్ని గిన్నిస్ రికార్డ్స్ తన అధికారిక వెబ్ సైటులో ప్రకటించింది. కాగా, 'potus' అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్. ఇది ఒబామాది మాత్రమే కాదని, 2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఎవరు విజయం సాధిస్తే వారికి ఈ ఖాతాను బదిలీ చేసేస్తామని వైట్హౌస్ ప్రకటించింది.

  • Loading...

More Telugu News