: ఆ గూగుల్ ఉద్యోగి మరణానికి నేనే కారణం: తప్పు ఒప్పుకున్న హై ప్రొఫైల్ కాల్ గర్ల్
గూగుల్ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగి ఫోరెస్ట్ హెయిస్ (51) హత్య కేసులో తాను దోషినేనని హై ప్రొఫైల్ వ్యభిచారిణి అలెక్స్ క్యాథరిన్ టిచెల్మన్ (27) అంగీకరించింది. ఈ మేరకు కాలిఫోర్నియా కోర్టులో తప్పు ఒప్పుకుంది. హెయిస్ కాలిఫోర్నియా తీరంలో పడవలో సేదదీరుతున్న వేళ తాను 'హెరాయిన్'ను ఇంజక్ట్ చేశానని అంగీకరించింది. ఆయనలో మరింత ఉద్రేకం కోసమే ఆ పని చేసినట్టు తెలిపింది. తప్పు ఒప్పుకోవడంతో ఆమెపై ఉన్న హత్య కేసును అసంకల్పిత హత్య కేసుగా మార్చిన కోర్టు ఆరేళ్ల జైలు శిక్షను విధించింది. నిషేధిత ఔషధాలను కలిగివుండడం, సాక్ష్యాలను నాశనం చేసే ప్రయత్నం చేయడం, వ్యభిచార వృత్తిలో ఉండడం వంటి ఆరోపణలూ వాస్తవమేనని అంగీకరించింది. అంతకుముందు ప్రాసిక్యూషన్ తన వాదన వినిపిస్తూ, ప్రాణాపాయ స్థితిలో హెయిస్ ఉంటే కనీసం '911'కు ఫోన్ చేయకుండా నింపాదిగా వైన్ తాగి ఆమె అక్కడి నుంచి వెళ్లిపోయినట్టు సీసీటీవీ ఫుటేజ్ లో నమోదైందని కోర్టుకు వివరించారు.