: 'మంచు'వారి పెళ్లిలో రామోజీ, జగన్ లు ఏం మాట్లాడుకున్నారు?
మోహన్ బాబు రెండవ కుమారుడు మంచు మనోజ్ వివాహ వేడుకలు హైదరాబాద్ మాదాపూర్ లో ఉన్న హైటెక్స్ లో కన్నులపండుగగా జరిగాయి. ఈ వివాహానికి విచ్చేసిన ఈనాడు గ్రూప్ ఛైర్మన్ రామోజీ రావు నూతన వధూవరులను ఆశీర్వదించి సోఫాలో కూర్చున్నారు. కాసేపటి తర్వాత వైకాపా అధినేత జగన్ కూడా విచ్చేశారు. ఈ సందర్భంగా రామోజీరావు వద్దకు జగన్ వెళ్లి, ఆయనకు నమస్కరించారు. రామోజీరావు కూడా సోఫాలో నుంచి లేచి జగన్ కు షేక్ హ్యాండ్ ఇచ్చారు. అనంతరం, రామోజీ పక్కనే ఉన్న సోఫాలో జగన్ కూర్చున్నారు. వీరిద్దరూ కాసేపు ముచ్చటించుకున్నారు. మాటల సందర్భంలో, కుశల ప్రశ్నలు వేసుకున్నారు. రామోజీ ఫిల్మ్ సిటీ వ్యవహారాలు ఎలా నడుస్తున్నాయంటూ రామోజీని జగన్ అడిగారు. బాగున్నాయంటూ రామోజీ సమాధానమిచ్చారు. అనంతరం, ఇంత ఎండల్లో కూడా ఎంతో కష్టపడి జనాల్లో తిరుగుతున్నావంటూ జగన్ ను రామోజీ అభినందించారు.