: తన కొడుకును అలా చేస్తారని ఆయనకు తెలియదు... సూట్ కేసులో బాలుడి ఘటనపై లాయర్


అధికారికంగా కొడుకును తన దగ్గరకు తెచ్చుకునే వీలు లేకపోవడంతో ఓ ఆఫ్రికన్ వాసి అడ్డదారులు తొక్కాడు. ఐవరీ కోస్ట్ కు చెందిన అలీ ఉత్తారా స్పెయిన్ పరిధిలోని ఫ్యుర్టెవెంచురాలోని ఓ లాండ్రీలో స్వల్ప వేతనానికి పని చేస్తున్నాడు. తన కొడుకును తెచ్చుకోవాలంటే స్పెయిన్ చట్టాల ప్రకారం ఉండాల్సిన నెలజీతం కనీసం 1,331 యూరోలు. అంత మొత్తం సంపాదన లేని అలీ మాఫియాను సంప్రదించి తన ఎనిమిదేళ్ల కొడుకు అలీని సరిహద్దులు దాటించాలని కోరాడు. వారు పాస్ పోర్టు, వీసాలు ఏర్పాటు చేసి తీసుకువస్తామని నమ్మబలికి 5 వేల డాలర్లు తీసుకొని ఓ సూట్ కేసులో బాబును పెట్టి చెక్ పోస్టు దగ్గర స్కానింగులో దొరికిపోయారు. సూట్ కేసులో బాబు ఉండడం చూసిన అధికారులు నిర్ఘాంతపోయి, ఆపై విషయం తెలుసుకుని అలీని కూడా అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. తన క్లయింటు కేవలం డబ్బు లేకనే ఈ పని చేశాడని, సూట్ కేసులో కొడుకును పెడతారని అతనికి తెలియదని, ఎవరైనా కొడుకును అలా చేసేందుకు అంగీకరిస్తారా? అని అలీ తరపు లాయర్ ప్రశ్నిస్తున్నాడు. త్వరలోనే అతనికి బెయిలు లభిస్తుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News