: ప్రయాణికుల ప్రతిఘటనతో దొంగల పలాయనం...జమ్ముతావి ఎక్స్ ప్రెస్ లో దొంగలకు షాక్
జమ్ము నుంచి చెన్నై వెళ్లే జమ్ముతావి ఎక్స్ ప్రెస్ రైల్లో మొన్న దొంగలు పడ్డారు. సోమవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత గుంటూరు, వేజెండ్ల రైల్వే స్టేషన్ల మధ్య చోటుచేసుకున్న ఈ ఘటనలో దొంగలకు షాక్ తగిలింది. ప్రయాణికులను భయభ్రాంతులకు గురి చేసి అందినకాడికి దోచుకెళదామని గంపెడాశతో రైల్లోకి చొరబడ్డ దొంగల పప్పులు ఉడకలేదు. దొంగలను ప్రయాణికులు తీవ్రంగా ప్రతిఘటించారు. అంతేకాక దోపిడీకి వచ్చిన సదరు దొంగలను బంధించి పోలీసులకు అప్పగించేందుకు ప్రయాణికులు యత్నించారు. దీంతో కంగుతిన్న దొంగలు పలాయనం చిత్తగించక తప్పలేదు. బుడంపాడు, నారా కోడూరుల మధ్య చైన్ లాగి రైలును ఆపేసిన దొంగలు పొలాల్లోకి పారిపోయారు.