: చెన్నయ్ సూపర్ కింగ్స్ లక్ష్యం 188


ఐపీఎల్ సీజన్-8లో భాగంగా ముంబైలోని వాంఖడే స్టేడియంలో చెన్నయ్ సూపర్ కింగ్స్ తో జరుగుతున్న తొలి క్వాలిఫయర్ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ జట్టు 6 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ప్రారంభించిన ముంబై ధాటిగా బ్యాటింగ్ ఆరంభించింది. పార్థివ్ పటేల్ (35), లెండిల్ సిమ్మన్స్ (65) శుభారంభం ఇచ్చారు. వీరిద్దరూ స్వల్ప వ్యవధిలో వెనుదిరగడంతో భారీ స్కోరు సాధిస్తుందనుకున్న ముంబై ఓ మోస్తరు స్కోరుకే పరిమితమైంది. కెప్టెన్ రోహిత్ (19), పాండ్య (1), రాయుడు (10) విఫలమవడంతో కీరన్ పొలార్డ్ (41) విరుచుకుపడ్డాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో ముంబై ఇండియన్స్ జట్టు 6 వికెట్లు కోల్పోయి 187 పరుగులు చేసింది. చెన్నయ్ బౌలర్లలో 3 వికెట్లతో బ్రావో రాణించగా, అతనికి మోహిత్ శర్మ, జడేజా, నెహ్రా తలో వికెట్ తీసి సహకారమందించారు.

  • Loading...

More Telugu News