: ఆకట్టుకుంటున్న ముంబై టాపార్డర్


ఐపీఎల్ సీజన్-8లో భాగంగా ముంబైలోని వాంఖడే స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ తో జరుగుతున్న తొలి క్వాలిఫయర్ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ ప్రారంభించిన ముంబై ఓపెనర్లు చెన్నై బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. దీంతో పది ఓవర్లపాటు ముంబై వికెట్ కోల్పోకుండా బ్యాటింగ్ చేసింది. 25 బంతుల్లో 35 పరుగులు చేసిన పార్థివ్ పటేల్ బ్రావో బౌలింగ్ లో జడేజాకు క్యాచ్ ఇచ్చాడు. దీంతో ముంబై తొలి వికెట్ కోల్పోయింది. అనంతరం 14వ ఓవర్ లో లెండిల్ సిమ్మన్స్ 51 బంతుల్లో మూడు ఫోర్లు, ఐదు సిక్సుల సాయంతో 65 పరుగులు చేసి జడేజా బౌలింగ్ లో పవన్ నేగీకి క్యాచ్ ఇచ్చాడు. దీంతో ముంబై రెండో వికెట్ కోల్పోయింది. అనంతరం స్కోరు పెంచేందుకు భారీ షాట్ అడిన కెప్టెన్ రోహిత్ (19) బ్రావో బౌలింగ్ లో జడేజాకు క్యాచ్ ఇచ్చాడు. దీంతో 16 ఓవర్లలో ముంబై మూడు వికెట్లు కోల్పోయి 139 పరుగులు చేసింది. క్రీజులో కీరన్ పోలార్డ్ (16)కు హార్డిక్ పాండ్య ఉన్నారు. ఈ మ్యాచ్ లో విజేతగా నిలిచే జట్టు నేరుగా ఫైనల్ కు ప్రవేశించనుంది.

  • Loading...

More Telugu News