: టాలెంట్ షోలో పోటీదారుపై హత్యాయత్నం


టాలెంట్ షోలో పాల్గొంటున్న పోటీదారుపై హత్యాయత్నం చోటుచేసుకుంది. టర్కీ జాతీయ టీవీ ఛానెల్ ఓ సింగింగ్ టాలెంట్ షో నిర్వహిస్తోంది. ఈ టాలెంట్ షోలో ముట్లు కయా(19) అనే యువతి పాల్గొంటోంది. షోలో పాడే పాటలను ఇంట్లో ప్రాక్టీస్ చేస్తుండగా, ఆమెపై గుర్తు తెలియని వ్యక్తి తుపాకీతో కాల్పులకు తెగబడ్డాడు. దీంతో ఆమె తలకు తీవ్రగాయమైంది. ఆసుపత్రిలో ఆమె చికిత్స పొందుతోంది. కాగా, ఆమెను పాడవద్దని హెచ్చరిస్తూ, పాడితే ప్రాణాలు తీస్తామంటూ బెదిరింపులు వచ్చినట్టు తెలుస్తోంది. ఈ ఘటనలో ఒక వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

  • Loading...

More Telugu News