: తొలి యోగా కళాశాల నెలకొల్పుతున్న చైనా


శారీరక, మానసిక ఆరోగ్యాలకు యోగా సాధన ఎంతో మేలని ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అంగీకరిస్తున్నారు. విదేశీయులు తమ దైనందిన కార్యక్రమాల్లో యోగాకు స్థానం కల్పిస్తుండడమే అందుకు నిదర్శనం. మార్షల్ ఆర్ట్స్ కు పుట్టినిల్లుగా పేర్కొనే చైనాలోనూ యోగా క్రమంగా ఆదరణ పొందుతోంది. తాజాగా, చైనాలోని యునాన్ యూనివర్శిటీలో యోగా కళాశాలను ఏర్పాటు చేస్తున్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ చైనాలో పర్యటించిన సందర్భంగా యునాన్ వర్శిటీ, ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ మధ్య ఒప్పందం కుదిరింది. చైనా-భారత్ సంయుక్త ప్రకటనలోనూ ఈ కళాశాల ఏర్పాటు విషయాన్ని పొందుపరిచారు. సెప్టెంబరు నుంచి అడ్మిషన్లు చేపడతారు. ఈ కళాశాలలో యోగా విద్యే కాకుండా, భారత సంస్కృతి, ఫిలాసఫీ కోర్సులు కూడా బోధిస్తారు. బోధన నిమిత్తం భారత్ నుంచి యోగా నిపుణులను ఆహ్వానిస్తున్నారు.

  • Loading...

More Telugu News