: చంద్రబాబు ద్రోహి... వెంకయ్య మాట మార్చారు: రఘువీరారెడ్డి
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడులపై ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి మండిపడ్డారు. గతంలో ప్రత్యేక హోదాతోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని చెప్పిన చంద్రబాబు... ఇప్పుడు మాటమార్చి కేవలం ప్రత్యేక హోదాతోనే ఏమీ సాధించలేమని అంటున్నారని మండిపడ్డారు. 'చంద్రబాబు పెద్ద ద్రోహి' అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మరోవైపు, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు విభజన సమయంలో... ఏపీకి ఐదేళ్లు ప్రత్యేక హోదా అని కాంగ్రెస్ చెబితే... కుదరదు, పదేళ్లు ఇవ్వాలని డిమాండ్ చేసిన సంగతిని గుర్తు చేశారు. అలాంటి వెంకయ్య ప్రస్తుతం ప్రత్యేక హోదాపై మౌనం వహించారని విమర్శించారు. టీడీపీ, బీజేపీలు ప్రత్యేక హోదాపై నాన్చుడు ధోరణిని అవలంబిస్తున్నాయని మండిపడ్డారు.