: కాశ్మీర్ ను చూస్తుంటే సల్మాన్ కు మాజీ ప్రేయసి గుర్తొచ్చిందట!


బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ జమ్మూకాశ్మీర్ లో ఓపక్క షూటింగ్ చేస్తూ, మరోపక్క సేదదీరుతున్నాడు. కబీర్ ఖాన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'భజరంగీ భాయీ జాన్' సినిమా షూటింగ్ లో పాల్గొంటున్న సల్లూ భాయ్ మాజీ ప్రేయసిని గుర్తుచేసుకుంటున్నాడు. కాశ్మీర్ ను చూడగానే కత్రినా గుర్తు వచ్చిందంటూ ట్వీట్ చేశాడు. సల్మాన్ తో బ్రేకప్ అనంతరం కత్రినా బాలీవుడ్ యంగ్ హీరో రణబీర్ కపూర్ తో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయింది. కాగా, కత్రినా తండ్రి కాశ్మీర్ కు చెందిన వ్యక్తి. ఆయన బ్రిటన్ లో స్థిరపడిపోయారు. అక్కడ ఓ బ్రిటిషర్ ను వివాహం చేసుకుని కత్రినాను కన్నారు. కాగా, 'మాషా అల్లా... కత్రినా గుర్తుకొస్తోంది' అంటూ ట్వీట్ చేయడం వెనుక మర్మమేమిటో... మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ సల్మాన్ ఖాన్ కే తెలియాలి. కొంపతీసి రణబీర్ ను ఇబ్బందుల్లోకి నెట్టడు కదా?

  • Loading...

More Telugu News