: స్వల్ప నష్టాల్లో ముగిసిన మార్కెట్లు


ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుకింగ్ కు మొగ్గు చూపడంతో ఈరోజు భారతీయ స్టాక్ మార్కెట్లు స్వల్ప నష్టాల్లో ముగిశాయి. ఇంట్రా డేలో ఒకానొక సమయంలో 185 పాయింట్ల లాభంలో కొనసాగిన మార్కెట్లు ఒక్కసారిగా అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. దీంతో ట్రేడింగ్ ముగిసే సమయానికి... సెన్సెక్స్ 42 పాయింట్ల నష్టంతో 27,646కు పడిపోయింది. నిఫ్టీ 8 పాయింట్లు కోల్పోయి 8,366 దగ్గర స్థిరపడింది. జస్ట్ డయల్, భారతి ఇన్ ఫ్రా టెల్, ఫినొలెక్స్ ఇండస్ట్రీస్, బాటా కంపెనీలు లాభాలను మూటగట్టుకున్నాయి. పీఎంసీ ఫిన్ కార్ప్, జైప్రకాశ్ పవర్, గోద్రెజ్ కన్జ్యూమర్ ప్రాడక్ట్స్, డెల్టా కార్ప్, సన్ టీవీలు టాప్ లూజర్స్ గా నిలిచాయి.

  • Loading...

More Telugu News