: తిరుమల లడ్డూ టోకెన్ల విధానంలో మార్పులు... ఇకపై కంపార్ట్ మెంట్లలోనే టోకెన్లు
లడ్డూ టోకెన్ల విధానంలో సమూల మార్పులు చేస్తున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో సాంబశివరావు వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఇకపై కంపార్ట్ మెంట్లలోనే లడ్డూ టోకెన్లు పంపిణీ చేస్తామని చెప్పారు. సాధారణ లడ్డూ టోకెన్లతో పాటు అదనపు లడ్డూ టోకెన్లు కూడా కంపార్ట్ మెంట్లలోనే ఇస్తామని వివరించారు. త్వరలో సర్వదర్శనం భక్తులకు నూతన విధానం అమలు చేస్తామన్నారు. ప్రత్యేక ప్రవేశ దర్శనం, సుదర్శనం టికెట్లు తీసుకునే భక్తులకు ఆన్ లైన్ లోనే అదనపు లడ్డూల టోకెన్లు పొందేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఇక నకిలీ లడ్డూ టోకెన్ల స్కాం కేసులో ముగ్గురు ఉద్యోగులను సస్పెండ్ చేశామని, మరో ఇద్దరు తాత్కాలిక ఉద్యోగులను తొలగించామని ఈవో తెలిపారు.