: ముగిసిన అరుణ షాన్ బాగ్ అంత్యక్రియలు


ఓ దుర్మార్గుడు చేసిన ఘోరంతో కోమాలోకి వెళ్లి, 42 ఏళ్లపాటు జీవచ్ఛవంలా బతికి, నిన్న కన్నుమూసిన అరుణా షాన్ బాగ్ అంత్యక్రియలు ముగిశాయి. ముంబై లోని కింగ్ ఎడ్వర్డ్ మెమోరియల్ ఆసుపత్రి నుంచి ఆమె అంతిమయాత్ర సాగింది. ఈ యాత్రలో ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు. అంతేకాకుండా, అరుణ మరణవార్త విన్న ఆమె బంధువులంతా ఆసుపత్రికి తరలి వచ్చారు. అందరి అశ్రునయనాల మధ్య అరుణ అంతిమయాత్ర సాగింది. ఆసుపత్రి నర్సులు ఇతర సిబ్బంది కొవ్వొత్తులు వెలిగించి ఆమె ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు. ఆసుపత్రి డీన్ సహా అందరూ ర్యాలీగా బోయివాడ శ్మశానవాటికకు చేరుకుని అంతిమ సంస్కారాలు నిర్వహించారు.

  • Loading...

More Telugu News