: 'రామాయణ సర్క్యూట్' పై ఆశలు పెట్టుకున్న తెలంగాణ సర్కారు


తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు ఏ ఒక్క అవకాశాన్ని కూడా వదులుకోరాదని టీఆర్ఎస్ సర్కారు భావిస్తోంది. ముఖ్యంగా, టూరిజం రంగంపై దృష్టిపెట్టింది. రాష్ట్రంలోని చారిత్రక ప్రదేశాలు, సందర్శనీయ స్థలాలు, పుణ్యక్షేత్రాలతో పలు ప్యాకేజీలు ఏర్పాటు చేసిన తెలంగాణ టూరిజం డెవలప్ మెంట్ కార్పొరేషన్ (టీటీడీసీ) ఇప్పుడు 'రామాయణ సర్క్యూట్' మంత్రం జపిస్తోంది. తెలంగాణలోని భద్రాచలం, రేఖపల్లి, పర్ణశాల, జీడికల్, జాటప్రోలు, రామగిరి కొండలు తదితర పుణ్యక్షేత్రాలతో కూడినదే ఈ రామాయణ సర్క్యూట్. ఈ ప్రాంతాలన్నింటికి రామాయణంతో సంబంధం ఉందని, అదే తమకు లాభిస్తుందని టీటీడీసీ భావిస్తోంది. ఈ క్షేత్రాలతో ప్రత్యేక ప్యాకేజీ ఏర్పాటు చేస్తామని, తద్వారా రామభక్తులకు అన్ని క్షేత్రాలను దర్శించే వీలు కలుగుతుందని టీటీడీసీ చైర్మన్ పి.రాములు తెలిపారు. భవిష్యత్తులో, ప్రజల స్పందనను బట్టి, ఈ సర్క్యూట్ ను నాగార్జునసాగర్ సర్క్యూట్ తో అనుసంధానిస్తామని చెప్పారు. ఈ చర్యలు తెలంగాణ టూరిజం పురోగతికి ఊతమిస్తాయని విశ్వసిస్తున్నట్టు చెప్పారు.

  • Loading...

More Telugu News