: ధోవతి ఎలా విప్పాలో నేర్పుతానని రష్యా నేత భార్యకు చెప్పా: మధ్యప్రదేశ్ మంత్రి గౌర్
మధ్యప్రదేశ్ మంత్రి బాబూలాల్ గౌర్ (84) మరోసారి వార్తల్లోకెక్కారు. ఆదివారం భోపాల్ లో జరిగిన పార్టీ రాష్ట్రస్థాయి కార్యక్రమంలో ఆయన వ్యవహారశైలి చర్చనీయాంశం అయింది. గౌర్ ఆ కార్యక్రమానికి వచ్చిన వారితో ఓ విషయాన్ని పంచుకున్నారు. ఇంతకుముందోసారి ఓ రష్యా నేత భార్యకు ధోవతి ఎలా విప్పాలో నేర్పుతానని చెప్పానని గుర్తు చేసుకున్నారు. దీంతో, ఆ కార్యక్రమానికి హాజరైన మహిళలను ఇది ఇబ్బందికర పరిస్థితుల్లోకి నెట్టింది. ఇదేమీ పట్టించుకోని మంత్రివర్యుడు తన మానాన తాను చెప్పుకుంటూ వెళ్లారు. ఆ రష్యా నేత భార్య తాను బెల్టు, జిప్పు లేకుండా ధోవతి ఎలా కట్టుకున్నానో అని ఆశ్చర్యపోయిందని తెలిపారు. దీంతో, ధోవతి ఎలా కట్టుకోవాలో నేర్పలేను గానీ, ఎలా విప్పాలో మాత్రం తప్పకుండా నేర్పుతానని చెప్పానని వివరించాడు. అయితే, ఇప్పుడు కాదు, తర్వాత ఎప్పుడైనా నేర్పుతానని చెప్పానని కూడా చమత్కరించినట్టు గుర్తు చేసుకున్నారు. అన్నట్టు... ఈ పార్టీ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర చీఫ్ నందకుమార్ చౌహాన్ కూడా హాజరయ్యారు. అయినాగానీ, గౌర్ మహాశయుడు తన ఘనకార్యాన్ని ఘనంగా చెప్పుకున్నారు.