: అత్తకు భోజనం పెట్టలేదని కోడళ్లకు కొరడా దెబ్బల శిక్ష


అత్తకు సేవ చేసేందుకు ఇష్టపడని ఇద్దరు కోడళ్లకు 20 కొరడా దెబ్బల శిక్ష విధించారో గ్రామ పంచాయితీ పెద్దలు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని మొరాదాబాద్ జిల్లా సాలవ గ్రామంలో జరిగింది. ఇద్దరు కోడళ్లు అత్తకు అన్నం పెట్టేందుకు, ఆమె బట్టలు ఉతికేందుకు నిరాకరించారు. దీంతో ఆ అత్త పంచాయితీని ఆశ్రయించింది. ఇరు పక్షాల వాదనలూ విన్న పెద్దలు కోడళ్లకు చెరో 20 కొరడా దెబ్బల శిక్ష వేశారు. ఆ వెంటనే శిక్షను అమలు చేయడంతో ఇద్దరికీ తీవ్రగాయాలయ్యాయి. వీరిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. విషయం తెలిసిన పోలీసులు గ్రామానికి చేరుకున్నారు. ఘటనపై నిజానిజాలు తెలుసుకునే నిమిత్తం విచారణ చేపట్టామని తెలిపారు.

  • Loading...

More Telugu News