: అసోంలో కూలిపోయిన సుఖోయ్ యుద్ధవిమానం
భారత వాయుసేనకు చెందిన ఫైటర్ ప్లేన్లు కూలిపోవడం కొత్తేమీ కాదు. మిగ్ శ్రేణికి చెందిన విమానాలు ఇప్పటికే పెద్ద సంఖ్యలో నేల రాలాయి. తాజాగా, అత్యాధునిక యుద్ధ విమానంగా పేరుగాంచిన సుఖోయ్-30 ఎంకేఐ అసోంలో కూలిపోయింది. ఈ మధ్యాహ్నం తేజ్ పూర్ కు 35 కిలోమీటర్ల దూరంలో ఈ ఘటన జరిగింది. అందులోని ఇద్దరు పైలెట్లు క్షేమంగా బయటపడ్డారు. విమానం కూలిపోతుందన్న విషయం పసిగట్టిన పైలెట్లు ఎజెక్షన్ వ్యవస్థను ఉపయోగించుకుని ప్రాణాలు దక్కించుకున్నారు. ఘటనపై భారత వాయుసేన శాఖాపరమైన విచారణకు ఆదేశించింది.