: ఆర్టికల్ 371 ప్రకారం నిట్ లో ఏపీ సీట్లు కోరడం సరికాదు: కడియం


వరంగల్ లో ఉన్న నిట్ సంస్థలో ఏపీ సీట్లు కోరడం దారుణమని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అన్నారు. ఈరోజు ఢిల్లీలో కేంద్ర మానవ వనరుల శాఖ కార్యదర్శి సత్యనారాయణ మహంతితో ఆయన సమావేశమయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉన్న నిట్ లో... గతంలో జనాభా ప్రాతిపదికన సీట్లను కేటాయించేవారంటూ ఏపీ చేస్తున్న వాదన సరికాదని చెప్పారు. ఆర్టికల్ 371 ప్రకారం ఏపీ వాదన చెల్లదని తెలిపారు. నిబంధనల ప్రకారం 50 శాతం సీట్లు తెలంగాణకు దక్కాలని... మిగిలిన సీట్లు ఇతర రాష్ట్రాలకు కేటాయించాలని చెప్పారు.

  • Loading...

More Telugu News