: దయచేసి ఆదుకోండి: జైట్లీతో మొరపెట్టుకున్న చంద్రబాబు


తీవ్ర ఆర్థిక లోటుతో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరిన్ని నిధులిచ్చి ఆదుకోవాలని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో సీఎం చంద్రబాబునాయుడు మొరపెట్టుకున్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన ఈ ఉదయం జైట్లీతో సమావేశమయ్యారు. వివిధ సంక్షేమ పథకాలకు నిధులు చాలడం లేదని జైట్లీకి వివరించిన చంద్రబాబు, పోలవరం ప్రాజెక్టు సకాలంలో పూర్తి అయ్యేందుకూ నిధులు అందించాలని కోరారు. దీనిపై జైట్లీ సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తోంది. పోలవరానికి నిధుల విషయమై మరో మంత్రి ఉమాభారతితో చర్చించాల్సి వుందని జైట్లీ అన్నట్టు సమాచారం. కాగా, కర్ణాటక నుంచి ఏపీ రాజధాని నగరం అమరావతి మధ్య కొత్త జాతీయ రహదారిని నిర్మించాలని కూడా బాబు కోరారని కేంద్ర మంత్రి సుజనా చౌదరి వివరించారు.

  • Loading...

More Telugu News