: అధికారులు, నేతల అండతోనే స్మగ్లింగ్... పోలీసులతో ‘ఎర్ర’ స్మగ్లర్ బదానీ


కడప జిల్లా పోలీసుల విచారణలో ఎర్రచందనం స్మగ్లింగ్ లో అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన ముఖేశ్ బదానీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అధికారులు, రాజకీయ నేతల అండతోనే తాను స్మగ్లింగ్ లో చక్రం తిప్పగలిగానని అతడు పేర్కొన్నాడు. అంతేకాక చిత్తూరు జిల్లా ఎర్రచందనం అక్రమ రవాణాకు కేంద్ర బిందువుగా మారిందని కూడా అతడు చెప్పినట్లు సమాచారం. ఎర్రచందనం దుంగల కొనుగోలులో భాగంగా చిత్తూరులోని ఓ వ్యవసాయ పొలంలో దాచిన పెద్ద డంప్ ను కొనుగోలు చేసేందుకు చిత్తూరు జిల్లాకు చెందిన బడా రాజకీయ నేత ఒకరు మధ్యవర్తిగా వ్యవహరించారని కూడా బదానీ చెప్పుకొచ్చాడు. ఇక కొల్లం గంగిరెడ్డితో సంబంధాలపై మీడియా అడిగిన ప్రశ్నలకు నవ్వేసి ఊరుకున్నాడు. దీంతో గంగిరెడ్డితోనూ బదానీకి సన్నిహిత సంబంధాలు ఉన్నాయని పోలీసులు అనుమానిస్తున్నారు.

  • Loading...

More Telugu News