: శ్రీరామ్ తో కలసి 'లయన్'ను చూసిన పరిటాల సునీత


ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత ప్రసాద్ ల్యాబ్స్ లో సందడి చేశారు. తన కుమారుడు శ్రీరామ్ తో కలసి టీడీపీ ఎమ్మెల్యే, ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ నటించిన 'లయన్' సినిమాను ఆమె వీక్షించారు. ప్రసాద్ ల్యాబ్స్ లో సునీత కోసం ఈ సినిమాను ప్రత్యేకంగా ప్రదర్శించారు. ఆమెతోపాటు ఆమె కుమారుడు శ్రీరామ్, సినిమా నిర్మాత రమణారావు, అనంతపురం జిల్లా పరిషత్ ఛైర్మన్, పరిటాల ముఖ్య అనుచరుడు చమన్ సినిమాను వీక్షించారు. అనంతరం, ఆమె మాట్లాడుతూ 'లయన్' సినిమా చాలా బాగుందని ప్రశంసించారు. సినిమాలో బాలకృష్ణ నటన అద్భుతంగా ఉందని కొనియాడారు.

  • Loading...

More Telugu News