: కేంద్రంలో టీఆర్ఎస్ చేరితే తెలంగాణలో బీజేపీతో పొత్తు ఉండదు: ఎర్రబెల్లి


కేంద్ర ప్రభుత్వంలో టీఆర్ఎస్ చేరబోతోందంటూ వస్తున్న వార్తలపై టీటీడీపీ నేత ఎర్రబెల్లి దయాకరరావు స్పందించారు. అలా చేస్తే తెలంగాణలో బీజేపీతో పొత్తు ఉండదని ఎర్రబెల్లి స్పష్టం చేశారు. కుమార్తెకు పదవి కోసమే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాని మోదీని పొగుడుతున్నారని ఎర్రబెల్లి విమర్శించారు. ఇదే సమయంలో టీఆర్ఎస్ నేతలపై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉస్మానియా, కాకతీయ విశ్వవిద్యాలయాల స్థలాలను కబ్జా చేశారని ఆరోపించారు. ఓయూ స్థలంలో టీఆర్ఎస్ నేత ముత్తిరెడ్డి హోటల్ కట్టారని, వరంగల్ లో దుగ్యాల శ్రీనివాసరావు వందెకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించారన్నారు. మరో ఎమ్మెల్యే కాకతీయ విశ్వవిద్యాలయ స్థలాన్ని ఆక్రమించుకున్నారని ఎర్రబెల్లి వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News