: పీసీ సర్కార్ తనయుడి రంగ ప్రవేశం... బెజవాడవాసులను మైమరపించిన యంగ్ పురుష్
పీసీ సర్కార్ మాయలకు అచ్చెరువొందని వారుండరు. అయితే సర్కార్ కు వయసు మీద పడుతోందిగా, ఇక మునుపటి తరహాలో ఆయన మంత్రజాలం చేయగలడా? అన్న సందేహాలు ఎంతమాత్రం అవసరం లేదు. ఎందుకంటే, పీసీ సర్కార్ రంగంలో ఉండగానే... జూనియర్ పీసీ సర్కార్ రంగ ప్రవేశం చేశాడు. నిన్న రాత్రి విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన ప్రదర్శనలో పీసీ సర్కార్ పుత్రరత్నం పీసీ సర్కార్ యంగ్ పురుష్ తనదైన శైలిలో ప్రేక్షకులను మైమరపించాడు. తండ్రికి తగ్గ తనయుడు అని నిన్నటి ప్రదర్శన చూసిన వారితో ప్రశంసలందుకున్నాడు.