: యాదాద్రిపై ఉచిత వైఫై సేవలు
శ్రీలక్ష్మీ నరసింహుని దివ్యధామం యాదాద్రి (యాదగిరిగుట్ట)పై భక్తులకు ఉచితంగా వైఫై సౌకర్యం అందుబాటులోకి రానుంది. ఈ మేరకు ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ అధికారులు దేవస్థాన ఎగ్జిక్యూటివ్ అధికారిణి గీతారెడ్డితో సమావేశమై చర్చించారు. కేబుల్ కనెక్షన్లు ఎలా ఇవ్వాలి? రూటర్ల తదితర సాంకేతిక పరికరాలు ఎక్కడెక్కడ అమర్చాలి? తదితర విషయాలపై చర్చలు జరిపాలు. 15 రోజుల్లో పనులు ప్రారంభమవుతాయని, వైటీడీఏలో భాగంగా భక్తులకు వైఫై సేవలను అందించనున్నామని సమావేశం అనంతరం ఈఓ వెల్లడించారు. ప్రధాన దేవాలయం మినహాయించి చుట్టుపక్కల ప్రాంతంలో 100 మీటర్ల వరకూ సిగ్నల్స్ అందుతాయని తెలిపారు.