: శివభక్తులపై తేనెటీగల దాడి... ఒకరు మృతి, పలువురికి గాయాలు


కడప జిల్లా సీకే దిన్నె మండలం బుగ్గా వెంకన్న ప్రాజెక్ట్ సమీపంలో మల్లేశ్వరస్వామి దర్శనం కోసం వెళుతున్న శివభక్తులపై నేటి ఉదయం తేనెటీగలు దాడి చేశాయి. ఈ దాడిలో ఓ భక్తుడు అక్కడికక్కడే మరణించగా, మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. వెనువెంటనే స్పందించిన స్థానికులు క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

  • Loading...

More Telugu News