: టీఆర్ఎస్ పై ఎర్రబెల్లి ఘాటు వ్యాఖ్యలు


తెలంగాణలో అధికార పార్టీ టీఆర్ఎస్ పై టీ టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకరరావు నిన్న ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ ను మగతనం లేని పార్టీగా ఆయన అభివర్ణించారు. ఆస్పత్రుల్లో పసిపిల్లలను ఎత్తుకెళ్లే దొంగల్లా తమ పార్టీ ఎమ్మెల్యేలు, నేతలను టీఆర్ఎస్ అపహరించుకునిపోతోందని కూడా ఎర్రబెల్లి ఆక్షేపించారు. నేతలు, ఎమ్మెల్యేలను సొంతంగా తయారుచేసుకునే మగతనం, సత్తా టీఆర్ఎస్ కు లేవని ఆయన తేల్చేశారు. హన్మకొండలో నిన్న జరిగిన వరంగల్ జిల్లా స్థాయి పార్టీ సమావేశంలో మాట్లాడిన సందర్భంగా ఎర్రబెల్లి ఈ మేరకు వ్యాఖ్యానించారు. తమ పార్టీ టికెట్లపై ఎమ్మెల్యేలుగా గెలిచి, టీఆర్ఎస్ లో చేరిన తలసాని శ్రీనివాసయాదవ్, చల్లా ధర్మారెడ్డిలకు రాజీనామా చేసే ధైర్యం లేదని కూడా ఆయన ఆరోపించారు.

  • Loading...

More Telugu News