: సత్య నాదెళ్లతో కేటీఆర్ భేటీ... హైదరాబాదులో మైక్రోసాఫ్ట్ ను విస్తరించాలని వినతి
తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు(కేటీఆర్) అమెరికా పర్యటనలో దూసుకెళుతున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు రాబట్టడమే లక్ష్యంగా అగ్రరాజ్యం వెళ్లిన కేటీఆర్ ఇప్పటికే పలు సాఫ్ట్ వేర్ దిగ్గజ సంస్థల ప్రతినిధులతో వరుస భేటీలు నిర్వహించారు. ఆయా భేటీల్లో పెట్టుబడులకు హైదరాబాదు స్వర్గధామమన్న విషయాన్ని చెప్పడమే కాక, ఎదుటి వారికి నమ్మకం కుదిరేలా ప్రజెంటేషన్ లు ఇచ్చిన కేటీఆర్ ఇప్పటికే పలు సంస్థల పెట్టుబడులకు సంబంధించి స్పష్టమైన హామీ సాధించారు. తాజాగా మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్లతో ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా హైదరాబాదులో మైక్రోసాఫ్ట్ కార్యకలాపాలను మరింత విస్తరించాలని ఆయన కోరారు. కేటీఆర్ విజ్ఞప్తికి సత్య నాదెళ్ల సానుకూలంగా స్పందించినట్లు సమాచారం.