: మోదీ నిర్ణయాన్ని స్వాగతించిన చైనా
భారత్ వచ్చే చైనా పర్యాటకులకు ఈ-వీసాలు జారీ చేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించడంపై చైనా హర్షం వ్యక్తం చేసింది. మోదీ నిర్ణయం అమోఘమంటూ చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి హోంగ్ లీ మాట్లాడుతూ... చైనా పర్యటన సందర్భంగా ప్రధానమంత్రి మోదీ చైనా టూరిస్టులకు ఈ-వీసాల జారీపై ప్రకటన చేయడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. మోదీ నిర్ణయానికి ప్రతిగా చైనా కూడా భారత టూరిస్టులకు ఇలాంటి వీసాలే జారీ చేస్తుందా? అని మీడియా అడగ్గా... చైనా చట్టాలకు అనుగుణంగా భారత్ తో కలిసి ఈ విషయంలో ముందుకెళ్లేందుకు చైనా సిద్ధంగా ఉందని హోంగ్ లీ తెలిపారు. మోదీ... అధ్యక్షుడు ఝీ జిన్ పింగ్ తో, ప్రధాని లీ కెకియాంగ్ తో ఫలప్రదమైన చర్చలు జరిపారని ఆయన వివరించారు.