: వాటి గురించి ఎందుకు?... దీని గురించి మాట్లాడుకుందాం: సల్మాన్
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'భజరంగి భాయిజాన్' సినిమా షూటింగ్ కోసం కాశ్మీర్లో ఉండగా, ఆయనను మీడియా 'హిట్ అండ్ రన్' కేసు గురించి కదిపింది. అయితే, సల్మాన్ ఈ సందర్భంగా కాస్తంత అసహనానికి లోనయ్యారు. "నా సమస్యలు చెప్పుకునేంత పెద్దవి కావు, చాలా చిన్నవి. మేం ప్రస్తుతం ఇక్కడ విహారయాత్రలో ఉన్నాం. దాని గురించి మాట్లాడుకుందాం" అని మీడియాకు బదులిచ్చారు. అంతకుమించి మాట్లాడేందుకు సల్మాన్ ఇష్టపడలేదు. సల్మాన్ తన సోదరి అర్పిత, ఇతర కుటుంబ సభ్యులు, మిత్రులతో కలిసి కాశ్మీర్ అందాలను ఆస్వాదిస్తున్నారు. హిట్ అండ్ రన్ కేసులో సల్మాన్ కు ముంబయి సెషన్స్ కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష విధించగా, బాంబే హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.