: 20 ఏళ్ల తరువాత తగ్గిన సెల్ ఫోన్ అమ్మకాలు
ఇండియాలో మొబైల్ ఫోన్ల అమ్మకాలు 20 సంవత్సరాల తరువాత తొలిసారిగా తగ్గాయి. గడచిన జనవరి - మార్చి త్రైమాసికంలో దేశవ్యాప్తంగా సెల్ ఫోన్ అమ్మకాలు 14.5 శాతం తగ్గాయని సైబర్ మీడియా రీసెర్చ్ కన్సల్టెన్సీ ప్రకటించింది. 2014 చివరి త్రైమాసికంలో 6.2 కోట్ల యూనిట్లు అమ్ముడుకాగా, ఈ సంవత్సరం తొలి మూడు నెలల కాలంలో 5.3 కోట్ల యూనిట్లకు అమ్మకాలు పడిపోయాయని వివరించింది. స్మార్ట్ ఫోన్ల అమ్మకాలు 7.4 శాతం తగ్గగా, రూ. 1500 లోపు ధరలో లభించే ఫీచర్ ఫోన్ల విక్రయాలు ఏకంగా 18.3 శాతం తగ్గాయి. ఇండియాలో మొబైల్ కనెక్షన్ల సంఖ్య 100 కోట్లను దాటడంతోనే అమ్మకాలు తగ్గుదల బాట పట్టాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కాగా, శరవేగంగా విస్తరిస్తున్న భారత మార్కెట్లో స్మార్ట్ ఫోన్ల విక్రయాలు తగ్గడం మొబైల్ ఫోన్ల తయారీ కంపెనీలకు ఆందోళన కలిగిస్తోంది.