: ఆ సమయంలో ఇండియా కుత్తుక పట్టుకున్నాం: పర్వేజ్ ముషారఫ్


1999లో జరిగిన కార్గిల్ యుద్ధాన్ని భారత్ ఎన్నటికీ మరచిపోబోదని పాకిస్థాన్ మాజీ మిలటరీ నియంత పర్వేజ్ ముషారఫ్ వ్యాఖ్యానించారు. ఆల్ పాకిస్థానీ ముస్లిం లీగ్ పార్టీ సమావేశంలో ప్రసంగిస్తూ, ఆ సమయంలో భారత్ కుత్తుక పట్టుకున్నామని ఆయన అన్నారు. ఇండియాకు తెలియకుండా కార్గిల్ ప్రాంతానికి నాలుగు వైపుల నుంచి చేరుకున్నామని, ముందున్న సైన్యం వెనుక సెకండ్ లైన్ ఫోర్స్ కూడా సిద్ధంగా ఉందని అప్పటి ఘటనను పర్వేజ్ గుర్తు చేసుకున్నారు. 1971 నాటి యుద్ధం తరువాత పాకిస్థాన్ తో అతిపెద్ద గన్ బ్యాటిల్ మే 1999న కాశ్మీర్ సరిహద్దుల్లో జరిగిన సంగతి తెలిసిందే. కాగా, పాక్ లో త్వరలో జరిగే స్థానిక ఎన్నికల్లో తన ఆధ్వర్యంలోని రాజకీయ పార్టీ బరిలోకి దిగుతుందని ఆయన స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News