: రాజధాని భూమి పూజకు నిర్ణయించిన ముహూర్తం సరైంది కాదు... మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది: శ్రీనివాస గార్గేయ


ఏపీ రాజధాని నిర్మాణానికి సంబంధించి నిర్ణయించిన ముహూర్తం సరైంది కాదని ప్రముఖ జ్యోతిష్య పండితుడు శ్రీనివాస గార్గేయ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో సాన్నిహిత్యం ఉన్న గార్గేయ స్వయంగా ఈ వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది. పుష్కరాలకు నలభై రోజుల ముందు ముహూర్తాలు వాస్తుపరంగా మంచి ఫలితాలను ఇవ్వవని... పుష్కరాలు ఆరంభమైన 70 రోజుల తర్వాత ముహూర్తాలు పెట్టుకుంటే బాగుంటుందని ఆయన అన్నారు. జూన్ 6వ తేదీన ముహూర్తం వాస్తు ప్రకారం లాభదాయకంగాను, శుభదాయకంగానూ లేదని గార్గేయ చెప్పారు. దీన్ని కాదని అదే ముహూర్తంతో ముందుకెళితే, తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని అన్నారు. ముహూర్తానికి సంబంధించి తనను ఎవరూ సంప్రదించలేదని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News