: ఎరక్కపోయి వచ్చి ఇరుక్కుపోయాడు!


ఇంటిని దోచుకుందామని వచ్చిన ఓ దొంగ ఇంటిలోని పొగగొట్టంలో ఇరుక్కుపోయాడు. ఆ తర్వాత ప్రాణభయంతో ఆ దొంగ కేకలు వేయడంతో ఇంటి వారితో పాటు ఇరుగుపొరుగు కూడా అవాక్కయ్యారు. మెదక్ జిల్లా సిద్దిపేటలోని అంబేద్కర్ నగర్ లో నిన్న రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. పట్టణానికి చెందిన భార్గవ్ అనే దొంగ రాత్రి ఓ ఇంటిలోకి చొరబడ్డాడు. తన పని ప్రారంభించకముందే మంచి నిద్రలో ఉన్న ఇంటి వారు కాస్త కదలడంతో అలికిడి అయ్యింది. దీంతో ఎక్కడ పట్టుబడిపోతానోనన్న భయంతో భార్గవ్ కనిపించిన ఖాళీ రంధ్రం ద్వారా బయటపడదామని యత్నించాడు. తీరా అతడికి కనిపించిన మార్గం పొగగొట్టం కావడంతో అతడు అందులో ఇరుక్కుపోయి పట్టుబడ్డాడు.

  • Loading...

More Telugu News