: హైదరాబాద్ బిర్యానీ ఎంత బాగుంటదో రోడ్లంత బాగుండాలె: నటుడు వేణుమాధవ్


'స్వచ్ఛ హైదరాబాద్' కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని హాస్య నటుడు వేణుమాధవ్ కోరారు. నిన్న ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభమైన 'స్వచ్ఛ హైదరాబాద్' కార్యక్రమానికి మద్దతిస్తూ సినీ పరిశ్రమ ఈ ఉదయం ప్రత్యేక సభను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో నటుడు వేణుమాధవ్ తనదైన శైలిలో నవ్వులు పూయిస్తూ మాట్లాడారు. హైదరాబాదులో 400 ఏళ్ల కిందటి చార్మినార్ ఉందని గుర్తు చేసిన ఆయన, ఇక్కడి బిర్యానీ రుచి చూసేందుకు ఎంతో మంది దేశ విదేశీయులు, పర్యాటకులు వస్తుంటారని వారికి పరిశుభ్రమైన హైదరాబాద్ నగరాన్ని పరిచయం చేయాలని అంటూ, "హైదరాబాద్ బిర్యానీ ఎంత బాగుంటదో రోడ్లంత బాగుండాలె" అని సలహా ఇచ్చారు. ఇంటువంటి మంచి కార్యక్రమాన్ని ప్రారంభించిన కేసీఆర్ కు అభినందనలని పొగిడారు.

  • Loading...

More Telugu News