: చేసిన తప్పు సరిదిద్దుకున్న ఫేస్ బుక్ చీఫ్


తల లేని భారత చిత్రపటాన్ని పోస్ట్ చేసి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న ఫేస్ బుక్ వ్యవస్థాపక చీఫ్ మార్క్ జుకర్ బర్గ్ తన తప్పును సరిదిద్దుకున్నారు. జమ్మూ కాశ్మీర్ లో కొంత భాగం లేకుండా ఆయన భారత మ్యాప్ ను పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో భారతీయ నెటిజన్ల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. భారతీయులకు ఉచితంగా ఇంటర్నెట్ సేవలను అందించేలా ప్రారంభించిన ఇంటర్నెట్ డాట్ ఓఆర్ జీని మలావీలో ప్రారంభించిన ఆయన ఇండియాలోనూ ఉచిత సేవలు అందుతాయని తెలుపుతూ, పాక్ ఆక్రమిత కాశ్మీర్ లేకుండా భారత మ్యాప్ ను పోస్ట్ చేశారు. దీనిపై నిరసన తెలుపుతూ, అసలు తమకు ఉచిత సేవలే వద్దంటూ, నెటిజన్ల నుంచి నిరసన పోస్టులు వేలాదిగా రావడంతో జుకర్ బర్గ్ స్పందించారు. తనకు భారత్ ను అవమానించే ఉద్దేశం లేదని, ఎవరి మనోభావాలైనా దెబ్బతిని ఉంటే మన్నించాలని ఆయన కోరారు.

  • Loading...

More Telugu News