: కేజ్రీకి షాక్... ఢిల్లీ సీఎస్ గా బాధ్యతలు చేపట్టిన శకుంతల


ఆప్ నేత అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ సీఎంగా రెండోసారి పదవిలోకి వచ్చీరాగానే రకరకాల సమస్యలు ఎదుర్కుంటున్నారు. పలు విషయాల్లో ఆయనకు దెబ్బమీద దెబ్బ తగులుతూనే ఉంది. ఇప్పటికే మీడియా నియంత్రణకు నడుం బిగించిన ఆయనకు కోర్టు అక్షింతలేసింది. తాజాగా ఢిల్లీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన శకుంతలా గామ్లిన్, కేజ్రీ అనుమతి లేకుండానే పదవీ బాధ్యతలు చేపట్టారు. సీఎస్ గా గామ్లిన్ నియామకంపై ఢిల్లీ లెఫ్ట్ నెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ తో ప్రత్యక్ష పోరుకు తెరతీసిన కేజ్రీకి ఈ పరిణామం పెద్ద షాకేనని చెప్పక తప్పదు. సాధారణంగా సీఎస్ ఎంపిక ముఖ్యమంత్రి అభీష్టం మేరకు జరగాల్సి ఉండగా, కేజ్రీ మాత్రం తన అత్యుత్సాహంతో ఈ అవకాశాన్ని చేజేతులా నేలపాల్జేసుకున్నారు. కొన్ని అంశాల్లో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న గామ్లిన్ ను సీఎస్ గా ఒప్పుకునేది లేదని కేజ్రీ చెప్పినా, నజీబ్ జంగ్ మాత్రం పట్టుబట్టి మరీ ఆమెనే ఆ పదవికి ఎంపిక చేయడం గమనార్హం.

  • Loading...

More Telugu News